close

ప్రధానాంశాలు

Published : 23/01/2021 05:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కర్బనాన్ని తొలగించు.. 10 కోట్ల డాలర్లు సాధించు

శాస్త్రవేత్తలకు ఎలాన్‌ మస్క్‌ ఆఫర్‌

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాలను వాతావరణం నుంచి తొలగించేందుకు మెరుగైన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలను వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ కోరారు. ఈ దిశగా అత్యుత్తమ సాంకేతికతను సాకారం చేసేవారికి 10 కోట్ల డాలర్ల బహుమతిని ప్రకటించారు. తదుపరి వివరాలను వచ్చే వారం ప్రకటిస్తానని ట్విటర్‌లో తెలిపారు.
నానాటికీ పెరుగుతున్న భూతాపం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. వాతావరణంలోకి చేరిన కర్బన ఉద్గారాలను తోడేయడం ద్వారా దీని నుంచి ఉపశమనం పొందొచ్చు. వాతావరణ మార్పులను కట్టడి చేయడానికి రూపొందిన అనేక ప్రణాళికల్లోనూ ఈ అంశానికి ముఖ్య పాత్ర కల్పించారు. అయితే అందుకు అవసరమయ్యే పరిజ్ఞానాలను సాకారం చేసే అంశంలో సాధించింది చాలా స్వల్పం. కొత్తగా వచ్చే ఉద్గారాల తగ్గింపునకు కావాల్సిన సాంకేతికతపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. కర్బన ఉద్గారాల విషయంలో ‘తటస్థ స్థాయికి’ చేరుకోవాలంటే వాటిని ఒడిసిపట్టే సాంకేతిక పరిజ్ఞానాలను భారీగా వినియోగించాల్సి ఉంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇటీవల స్పష్టంచేసింది. అమెరికా కొత్త అధ్యక్షుడు జై బైడెన్‌ కూడా కర్బనాన్ని తోడేసే పరిజ్ఞానాల అభివృద్ధిని వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మస్క్‌ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన