close

ప్రధానాంశాలు

Published : 23/01/2021 05:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గణతంత్ర పరేడ్‌లో ‘అయోధ్య రామాలయం’

దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించే కవాతులో ఉత్తర్‌ప్రదేశ్‌ శకటం ఆకట్టుకోనుంది. అయోధ్య రామాలయం నమూనాతో పాటు రామాయణ ఇతిహాసాలను వివరించేలా దీన్ని రూపొందించారు.

తొలిసారిగా లద్దాఖ్‌ శకటం
గణతంత్ర కవాతులో తొలిసారిగా లద్దాఖ్‌ అడుగుపెట్టనుంది. తిక్సే బౌద్ధ ఆరామ క్షేత్ర సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే శకటాన్ని కళాకారులు ప్రదర్శించనున్నారు. 2019లో లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

యుద్ధ నౌకల నమూనాలు..
భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌక నమూనాలను కవాతులో ప్రదర్శించనున్నారు. 1971 భారత్‌-పాక్‌ యుద్ధంలో సేవలు అందించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ కార్యకలాపాల నమూనాలను ఇందులో సైనికులు ప్రదర్శిస్తారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన