భారత్‌ టీకా మాకు సంజీవని

ప్రధానాంశాలు

Published : 24/01/2021 05:16 IST

భారత్‌ టీకా మాకు సంజీవని

వ్యాక్సిన్ల సరఫరాపై బ్రెజిల్‌ అధ్యక్షుడి హర్షం

న్యూయార్క్‌: కొవిడ్‌-19పై పోరు కోసం తమ దేశానికి 20 లక్షల డోసుల టీకాలను అందించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సోనారో కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో హనుమంతుడి చిత్రాన్ని ఉపయోగించారు. ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నమస్కారం! ప్రపంచ మహమ్మారిని అధిగమించే క్రమంలో ఓ గొప్ప భాగస్వామి లభించడం బ్రెజిల్‌కు దక్కిన గౌరవం. భారత్‌ నుంచి బ్రెజిల్‌కు టీకా ఎగుమతి చేయడం ద్వారా మాకు సహాయం చేస్తున్నందుకు ధన్యావాదాలు’’ అని పేర్కొన్నారు. రామాయణ కావ్యంలో.. యుద్ధంలో గాయపడిన లక్ష్మణుడిని కాపాడేందుకు సంజీవని మూలిక అవసరమైంది. దాన్ని తీసుకొచ్చే క్రమంలో హనుమంతుడు ఏకంగా పర్వతం మొత్తాన్నీ తరలించుకొస్తాడు. ఆ ఘటాన్ని ఉపయోగించుకుంటూ బ్రెజిల్‌ అధ్యక్షుడు.. మోదీకి వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు భారత్‌ పంపిన టీకాలు శుక్రవారం సావో పాలో చేరుకున్నాయని బ్రెజిల్‌ ఆరోగ్యశాఖ తెలిపింది.
అంతర్జాతీయంగా కొవిడ్‌-19పై జరుగుతున్న పోరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధిపతి గెబ్రెయెసస్‌ కృతజ్ఞతలు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన