
ప్రధానాంశాలు
పాక్ సరిహద్దులో.. మరో సొరంగం
జమ్మూ: జమ్మూ-కశ్మీర్‌లోని పాక్ సరిహద్దులో పది రోజుల వ్యవధిలోనే మరో సొరంగం బయటపడింది. కథువా జిల్లా హీరానగర్ సెక్టార్‌లోని పాన్సార్ బోర్డర్ అవుట్‌పోస్టు వద్ద ఉగ్రవాదుల చొరబాటుకు వీలుగా తవ్విన సొరంగాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది. ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా బీఎస్ఎఫ్ యాంటీ-టన్నెలింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. తాజాగా గుర్తించిన సొరంగం 30 అడుగుల లోతులో 3 మీటర్ల వ్యాసంతో 150 మీటర్ల మేర పాక్ భూభాగంలోకి ఉందని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి శనివారం తెలిపారు. కాగా గత ఆరు నెలల్లో పాక్ సరిహద్దులో సొరంగాలను గుర్తించడం ఇది నాలుగోసారి.
ఉగ్రవాదుల స్థావరం బట్టబయలు
జమ్మూ: జమ్మూ-కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరం శనివారం బట్టబయలైంది. నిఘా వర్గాల సమాచారంతో హాదిగూడ ప్రాంతంలోని దోబా మొహల్లా అడవిలో బీఎస్ఎఫ్ తనిఖీలు చేపట్టగా ఈ భూగర్భ స్థావరం బయటపడింది. దీన్నుంచి ఏకే-47 తుపాకీ, మూడు చైనా పిస్తోళ్లు, నాలుగు చేతి గ్రనేడ్లు, వందకుపైగా రౌండ్ల మేగజైన్లు, వైర్లెస్ సెట్టు స్వాధీనం చేసుకున్నారు. మండీ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్థావరం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నప్పటికీ బీఎస్ఎఫ్ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ప్రధానాంశాలు
సినిమా
- బాబు గీసిన బొమ్మ.. ఎంజాయ్ చేస్తోన్న అనుపమ
- జయసుధను ఇలా చూశారా..?
- సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- మార్చి 4 నుంచి రష్మిక మకాం అక్కడే!
- ఇంతకీ నీ అసలు వయసెంత అఫ్రిది?
- గృహ రుణాలపై ఎస్బీఐ గుడ్‌న్యూస్
- రేణిగుంట నుంచి బయల్దేరిన చంద్రబాబు
- అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
- తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ టీకా పంపిణీ కేంద్రాలివే..
- నటి హిమజకు పవన్ లేఖ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
