close

ప్రధానాంశాలు

Published : 25/01/2021 05:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రధాని ఓలి ప్రాథమిక సభ్యత్వం రద్దు

నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రకటన

కాఠ్‌మాండూ: నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రాథమిక సభ్యత్వాన్ని ఆ పార్టీలోని ప్రచండ వర్గం రద్దు చేసింది. ప్రధాని ఓలి గత డిసెంబరులో పార్లమెంట్‌ను ఏకపక్షంగా రద్దు చేసినప్పటినుంచి ప్రచండ వర్గం అతనిపై ఆగ్రహంతో ఉంది. అధికార పార్టీ రెండుగా చీలిపోగా.. మెజార్టీ వర్గం ప్రచండ నాయకత్వాన్ని బలపరుస్తోంది. రెండు వర్గాల మధ్య సయోధ్యకు చైనా బృందం సైతం చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే పార్టీ ఛైర్మన్‌గా ఓలిని తప్పించిన ప్రచండ వర్గం, తాజాగా ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు ఓలి పాల్పడ్డారని, దీనిపై పార్టీ నాయకత్వానికి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన