
ప్రధానాంశాలు
విధ్వంసం విద్రోహుల చర్యే
సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడి
దిల్లీ: రైతుల గణతంత్ర కవాతులో జరిగిన హింసాత్మక ఘటనలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘ఆ ఘటనలు అవాంచితం.. ఏ మాత్రం సమర్థనీయం కాదు. తాము ఎంతగా ప్రయత్నించినా కొన్ని సంఘాలు, కొందరు వ్యక్తులు నిర్దేశిత మార్గాన్ని ఉల్లంఘించారు’ అని ఆరోపించింది. ర్యాలీని నిలిపివేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించిన మోర్చా నేతలు...రైతులందరూ తక్షణమే తమ తమ దీక్షా శిబిరాలకు తిరిగి వచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. కవాతులో సంఘ విద్రోహ శక్తులు చొరబడటం వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ‘శాంతి మా అతిపెద్ద బలం. నిబంధనలను పాటించని వారితో మాకు ఎలాంటి సంబంధం లేదు. మంగళవారం నాటి హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని సంయుక్త కిసాన్ మోర్చా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ట్రాక్టర్ల కవాతులో శాంతియుతంగా పాల్గొన్న రైతులకు ధన్యవాదాలు తెలిపింది.
పోలీసుల చర్యలే కారణం: రాకేష్ తికాయత్
హింసాత్మక చర్యలు రైతుల పని కాదని, ఎవరో ఉద్దేశపూర్వకంగా చేశారని, అలాంటి వారిలో కొందరిని గుర్తించామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ తెలిపారు. దిల్లీ పోలీసుల చర్యలు కూడా సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోవడానికి కారణమయ్యాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ముందుగా చెప్పిన ప్రాంతాల్లో కాకుండా ర్యాలీకి అనుమతించిన మార్గాల్లోనూ బారికేడ్లను నిర్మించారని ఆరోపించారు. రైతులను తప్పుదోవపట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఈ పని చేశారని తికాయత్ విమర్శించారు. శాంతియుతంగా కొనసాగాల్సిన ట్రాక్టర్ల కవాతు హింసాత్మకంగా మారడంపై స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘జరిగిన ఘటనలపై ఉద్యమంలో ఒక భాగస్వామిగా సిగ్గుపడుతున్నా. వాటికి బాధ్యతవహిస్తా’ అని ఓ టీవీ కార్యక్రమంలో పేర్కొన్నారు.
ప్రధానాంశాలు
సినిమా
- తప్పతాగేసి.. తోచినట్లు తోలేసి..
- గ్లామర్‌తో కట్టిపడేస్తున్న జూనియర్ సమంతలు!
- ఈమె పాక్ ‘ఐష్’!
- నయా దందా..
- ఆ పాపకు రూ.16 కోట్ల ఇంజెక్షన్..
- తల్లికాబోతున్న హీరోయిన్ రిచా
- నా మాజీ ప్రియుడు ఇంకా అక్కడే ఉండిపోయాడు
- వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
- తను ఛిద్రమైనా... బిడ్డ భద్రం
- చైనా నుంచి యాంగూన్కు రహస్యంగా విమానాలు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
