కొత్త సాగు చట్టాల రాజ్యాంగబద్ధతపై సమాధానమివ్వండి
close

ప్రధానాంశాలు

Published : 29/01/2021 04:10 IST

కొత్త సాగు చట్టాల రాజ్యాంగబద్ధతపై సమాధానమివ్వండి

కేరళ ఎంపీ వ్యాజ్యంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు

దిల్లీ: కొత్తగా తీసుకొచ్చిన 3 సాగు చట్టాల రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ కేరళ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌ (కాంగ్రెస్‌) దాఖలు చేసిన వ్యాజ్యంపై సమాధానం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు గురువారం కేంద్రాన్ని ఆదేశించింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ.బోబ్డే, జస్టిస్‌ ఏ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. అలాగే ఈ విషయమై ఇప్పటికే పెండింగులో ఉన్న అంశాలతో ఈ వ్యాజ్యాన్ని జత చేయాల్సిందిగా ఆదేశించింది.
న్యాయవాది ద్వారా వ్యాజ్యం దాఖలు చేసిన త్రిశూర్‌ లోక్‌సభ సభ్యుడు ప్రతాపన్‌ ఈ సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించారు. కొత్త చట్టాలు రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14 (సమానత్వపు హక్కు), 15 (వివక్ష లేకుండా చేయడం), 21 (జీవించే హక్కు, స్వేచ్ఛ)లను ఉల్లంఘిస్తున్నాయని ప్రతాపన్‌ ఆరోపించారు. ఈ చట్టాలు రాజ్యాంగవిరుద్ధంగాను, చట్టబద్ధతలేనివిగాను ఉన్నందున వీటిని రద్దుచేయాలని కోరారు. ఈ సందర్భంగా భారత వ్యవసాయం తీరుతెన్నులను ఆయన వివరించారు. ‘‘భారత వ్యవసాయం చిన్న భూభాగాల్లో సాగుతుంటుంది. అలాగే వాతావరణంపై ఆధారపడటం, ఉత్పత్తిలో అనిశ్చితులు, ఊహించలేని మార్కెట్‌ వంటి నియంత్రణలో లేని స్వాభావిక బలహీనతలను కలిగి ఉంటుంది. దీంతో వ్యవసాయం ఇబ్బందులతో కూడుకుని ఉంటుంది.’’ అని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ‘‘2015-16 వ్యవసాయ గణన ప్రకారం పీఎం-కిసాన్‌ పథకానికి వ్యయాన్ని లెక్కించేందుకు కేంద్రం దేశంలో 14.5 కోట్ల మంది వ్యవసాయం చేస్తున్నట్లు పేర్కొంది. వీరందరి హక్కులను ఉల్లంఘిస్తున్న ఇలాంటి చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం ఉంది.’’ అని ఎంపీ పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన