అవి సమాజ వ్యతిరేక నేరాలు

ప్రధానాంశాలు

Updated : 03/02/2021 08:20 IST

అవి సమాజ వ్యతిరేక నేరాలు

అవినీతి నిరోధక చట్టం పరిధిలోని వాటిపై సుప్రీం వ్యాఖ్య

దిల్లీ: అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే నేరాలను ‘సమాజ వ్యతిరేక నేరాలు’గా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి వాటిపై మరింత జాగ్రత్తతో కూడిన, సమగ్ర విచారణ అవసరమని పేర్కొంది. ముడుపుల కేసులో ఓ ఉద్యోగిని నిర్దోషిగా తేలుస్తూ గుజరాత్‌ హైకోర్టు 2015 జనవరి 12న తీర్పు వెలువరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అపీలుపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ నిర్వహించింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను హైకోర్టు పరిశీలించిన తీరుపై పెదవి విరిచింది. వాటిని మరింత జాగ్రత్తగా పునఃపరిశీలించాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆదేశించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన