విదేశాలకు బహుమతిగా 56 లక్షల డోసుల వ్యాక్సిన్‌!

ప్రధానాంశాలు

Updated : 05/02/2021 12:06 IST

విదేశాలకు బహుమతిగా 56 లక్షల డోసుల వ్యాక్సిన్‌!

వాణిజ్యపరంగా మరో 100 లక్షల డోసులు
విదేశీ వ్యవహారాలశాఖ వెల్లడి

దిల్లీ: వివిధ దేశాలకు భారత్‌ 56 లక్షల డోసుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను బహుమతిగా, మరో 100 లక్షల డోసులను వాణిజ్యపరంగా అందించినట్టు విదేశీ వ్యవహారాలశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. ‘‘ఇప్పటివరకూ భూటాన్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, మారిషస్‌, శ్రీలంక, యూఏఈ, బ్రెజిల్‌, మొరాకో, ఒమన్‌, ఈజిప్ట్‌, కువైట్‌, అల్జీరియా, దక్షిణాఫ్రికా, సీషెల్స్‌, బహ్రెయిన్‌లకు టీకాలను ఎగుమతి చేశాం. త్వరలోనే పసిఫిక్‌ ద్వీపాలు, అఫ్గానిస్థాన్‌, మంగోలియా, నికరాగువాలకు వ్యాక్సిన్లు చేరుకుంటాయి. స్థానిక అవసరతలను పరిగణనలోకి తీసుకున్నాకే విదేశాలకు వాటిని ఎగుమతి చేస్తున్నారు’’ అని శ్రీవాస్తవ చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన