close

ప్రధానాంశాలు

Updated : 23/02/2021 11:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మేనకా గంభీర్‌ను ప్రశ్నించిన సీబీఐ

  బెంగాల్‌ రాజకీయాల్లో కాక

కోల్‌కతా: బెంగాల్‌ రాజకీయాల్లో కాక కొనసాగుతోంది. బొగ్గు చౌర్యం కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ మరదలు మేనకా గంభీర్‌ను సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించారు. ఆమెతో పాటు అభిషేక్‌ భార్య రుజిరా బెనర్జీకి సీబీఐ ఆదివారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా కోల్‌కతాలోని మేనక నివాసానికి అధికారుల బృందం సోమవారం వెళ్లింది. ఇద్దరు మహిళా అధికారులు దాదాపు మూడు గంటలపాటు ఆమెను ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు.
సమన్లపై స్పందించిన రుజిరా బెనర్జీ
బొగ్గు చౌర్యం కేసులో సీబీఐ తనకు జారీ చేసిన సమన్లపై రుజిరా బెనర్జీ సోమవారం స్పందించారు. తనను ప్రశ్నించేందుకు మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తన నివాసానికి రావాలంటూ అధికారులకు లేఖ రాశారు. తనను ఎందుకు ప్రశ్నించనున్నారనే విషయం మాత్రం తనకు తెలియదని అందులో పేర్కొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన