
ప్రధానాంశాలు
గల్లంతైన ఆ 136 మందీ చనిపోయినట్లే!
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటన
దేహ్రాదూన్: చమోలీ జల ప్రళయంలో గల్లంతై.. ఆచూకీ తెలియకుండా పోయిన 136 మందీ ‘చనిపోయినట్లే భావిస్తున్నట్లు’ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 7న జరిగిన ఈ ఘోర విపత్తులో గల్లంతైనవారిలో ఇంతవరకు 68 మంది మృతదేహాలను కనుగొన్నారు. మిగతావారంతా చనిపోయినట్లే భావిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్ సింగ్ నేగి మంగళవారం తెలిపారు. సాధారణంగా ఏదైనా ఘటనలో ఎవరైనా అదృశ్యమై, ఏడేళ్ల వరకు ఆచూకీ దొరకకపోతేనే వారు మరణించినట్లు ధ్రువీకరిస్తారు. ఉత్తరాఖండ్‌లో తలెత్తిన అసాధారణ విపత్తులకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయని నేగి తెలిపారు. ఈనెల 21న కేంద్రం జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ) ప్రకారం తాజాగా ప్రకటన విడుదల చేసినట్లు వివరించారు. 2013లో కేదార్నాథ్ జలప్రళయ సమయంలోనూ కేంద్రం ఇలాంటి ఎస్‌ఓపీనే జారీ చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ తాజా ప్రకటన ప్రకారం - గల్లంతై, మరణించినట్లు భావిస్తున్న వారి కుటుంబికులకు నష్టపరిహారం పంపిణీ, మరణ ధ్రువపత్రాల జారీ వంటి ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇందుకుగాను గల్లంతైన వారిని - ‘విపత్తు ప్రాంతానికి చెందినవారు, ఉత్తరాఖండ్‌లోని ఇతర జిల్లాలకు చెందినవారు, వేరే రాష్ట్రాల పర్యాటకులు/వ్యక్తులు’ - అనే 3 కేటగిరీలుగా విభజించి అవసరమైన చర్యలు చేపడతారు. గల్లంతైనవారి విషయంలో ముందు విచారణ చేపడతారు. అనంతరం వారికి సంబంధించిన వివరాలను హిందీ, ఆంగ్ల పత్రికల్లో, ప్రభుత్వ వెబ్సైట్లోనూ ప్రకటన ఇస్తారు. 30 రోజుల్లోగా అభ్యంతరాలు రాకపోతే సంబంధిత వ్యక్తుల మరణ ధ్రువపత్రాలను కుటుంబికులకు అందజేస్తారు.
ప్రధానాంశాలు
సినిమా
- పాపం ప్రియ.. షారుఖ్ తనయ..
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- పెళ్లిపై స్పందించిన విశాల్
- రేపు భారత్ బంద్
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- పిచ్‌తో కాదు బ్యాటింగ్ వల్లే 2 రోజులు: కోహ్లీ
- స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్
- భారత్‌కే ‘ఫైనల్’ అవకాశం: ఇంగ్లాండ్ ఎలిమినేట్
- ఆక్సిజన్ కొరత..ఆఫ్రికా, లాటిన్ దేశాలు విలవిల!
- రెండు రోజుల సంబరం.. కోహ్లీసేన అంబరం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
