
ప్రధానాంశాలు
మార్చి 31 వరకూ కొవిడ్ నిబంధనలు
కరోనా విజృంభణ నేపథ్యంలోనే
ఈనాడు, దిల్లీ: దేశంలో కొవిడ్ కట్టడి నిబంధనలు వచ్చే నెల 31 వరకు కొనసాగనున్నాయి. కరోనా విజృంభణ రెండో దశ ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకూ అన్ని చోట్లా నిఘా ఉంచడంతో పాటు కట్టడి చర్యలు కొనసాగించాలని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. క్రియాశీలక కేసులు భారీగా తగ్గినప్పటికీ మహమ్మారి కబంధ హస్తాల నుంచి పూర్తిగా బయటపడటానికి ఇంకా నిఘా, జాగ్రత్తలు, నియంత్రణలు అవసరం అని తెలిపింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
రెండోరోజూ 16 వేలకు పైగా..
దిల్లీ: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తాజాగా 24 గంటల్లో కొవిడ్ మరణాలేవీ నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం క్రియాశీలక కేసుల సంఖ్య వెయ్యిలోపే ఉందని వెల్లడించింది. మరోవైపు- దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 16,577 మంది వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. క్రితం రోజు కూడా 16 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 120 మంది కొవిడ్ దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 56 మంది మరణించారు. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో తొలి మరణం నమోదైంది.
మరిన్ని
సినిమా
- ఈ లెక్కలన్నీ చెప్పాల్సిందే...
- శంకర్ మర్చిపోకు.. నావల్లే నీకు ఫేమ్ వచ్చింది
- అందుకు క్షమాపణలు చెబుతున్నా: తనికెళ్ల భరణి
- మీనా- నదియా సందడి.. పడవలో అప్సర రాణి
- కన్నకొడుకే కాలయముడై..
- సాగరతీరంపై రక్తపుమరక
- ఆ ఓటీటీలో శర్వానంద్ ‘శ్రీకారం’
- అంతం చేసిన ఆవేశం
- నువ్వు ఆరెంజ్ క్యాప్ గురించి ఆలోచించకు:కోహ్లీ
- జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
