
ప్రధానాంశాలు
సామాజిక మాధ్యమాల్లో ప్రముఖమైనవి ఇవే
50 లక్షల ఖాతాదారులు ఉండాలని నిర్దేశించిన కేంద్రం
దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో ప్రముఖమైనవి ఏవన్న విషయం గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రామాణికతను నిర్దేశించింది. ఈమేరకు 50 లక్షల మంది నమోదిత ఖాతాదారులున్న వాటిని ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికలు (సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్)గా గుర్తించనున్నట్లు వెల్లడించింది. సామాజిక మాధ్యమాలు, ఓటీటీలకు కేంద్రం గురువారం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ సామాజిక మాధ్యమాలుగా గుర్తించిన వాటికి అదనపు నిబంధనలుంటాయని తెలిపింది. ఆ నిబంధనలేమిటో కూడా పేర్కొంది. తాజాగా ఏయే సామాజిక మాధ్యమాలను ప్రముఖమైనవిగా గుర్తించనుందో ఓ ప్రకటనలో తెలిపింది.
పార్లమెంటు ఆమోదం లేకుండానే కొత్త నిబంధనలా! : కాంగ్రెస్
పార్లమెంటు ఆమోదం లేకుండానే కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాలకు కొత్త నిబంధనలను తీసుకొచ్చిందని కాంగ్రెస్ విమర్శించింది. వీటిని ‘చట్టబద్ధత లేని’ మార్గదర్శకాలుగా వ్యాఖ్యానించింది. దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉన్న విస్తృత అధికారాలను ప్రభుత్వం అధికారులకు కట్టబెట్టిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతనిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి చట్టం తేలేదని, నాలుగేళ్లుగా కనీసం డేటా పరిరక్షణ చట్టాన్ని కూడా ఆమోదించలేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల నియంత్రణకు నిబంధనలు తీసుకొచ్చేటప్పుడు పార్లమెంటరీ పరిశీలన అవసరమన్నారు. సరైన కసరత్తు లేకుండా ఇలాంటి నిబంధనలు తీసుకొస్తే వాక్ స్వాతంత్య్రానికి, సృజనాత్మకతకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని అభిప్రాయపడ్డారు.
అదేమీ కొత్త నిబంధన కాదు..
‘అత్యవసర’ సందర్భాల్లో ఇంటర్నెట్ సమాచారాన్ని (కంటెంట్)ను నిలిపివేయడం కొత్త నిబంధనేమీ కాదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ శనివారం స్పష్టం చేసింది. 2009 నుంచే ఈ నిబంధన ఉన్నట్లు వివరించింది.
మరిన్ని
సినిమా
- కరోనా వ్యాక్సిన్ ఎవరెవరు వేసుకోకూడదు?
- ప్రేమించిన వ్యక్తితో కూతురు వెళ్లిపోయిందని...
- వైరస్ ప్రభావం త్వరలో తారస్థాయికి
- పిల్లల్లో పెరుగుతున్న ముప్పు
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- ‘హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే’
- నేను ఎస్టీ కాదని రుజువు చేయగలరా?
- Tiktok స్టార్ భార్గవ్ చిప్పాడ అరెస్ట్
- భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం
- కొవిడ్‌కు మరో సమర్థ ఔషధం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
