డ్రాగన్‌ పవర్‌ కుట్ర
close

ప్రధానాంశాలు

Updated : 02/03/2021 10:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రాగన్‌ పవర్‌ కుట్ర

లద్దాఖ్‌ ఘర్షణల సమయంలోనే..
భారత్‌లోని విద్యుత్‌ గ్రిడ్‌లపై సైబర్‌ దాడులకు పన్నాగం
‘ముంబయి’ అంతరాయం వెనుకా ఆ దేశమే
అమెరికా సంస్థ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ వెల్లడి

ద్దాఖ్‌ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్న సమయంలో.. భారత్‌ విద్యుత్‌ గ్రిడ్‌లపై సైబర్‌ దాడులు చేసి.. దేశాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టాలని చైనా ప్రయత్నించిందా? మన దేశాన్ని దిగ్బంధనం చేయాలనుకుందా?  అంటేే అవుననే సమాధానాలు వస్తున్నాయి.  గతేడాది భారత్‌-చైనాల మధ్య నెలలపాటు నెలకొన్న ప్రతిష్టంభన కాలంలోనే భారత్‌ విద్యుత్‌ రంగంపై డ్రాగన్‌ సైబర్‌ దాడులకు పాల్పడిందంటూ అమెరికా సంస్థ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ సంచలనాత్మక విషయాలను బయటపెట్టింది.

2020 అక్టోబర్‌ 12. ముంబయిలో విద్యుత్‌ గ్రిడ్‌ విఫలమైంది. ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో ముంబయి జనజీవనం స్థంభించిపోయింది. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. రెండు గంటల తర్వాత విద్యుత్‌ పునరుద్ధరణ జరిగింది. అయితే ఆ అంతరాయం వెనుక చైనా హస్తం ఉందంటోంది అమెరికా సంస్థ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’. జూన్‌లో గల్వాన్‌ లోయలో ఘర్షణ చెలరేగితే.. ఆ తర్వాత నాలుగు నెలలకే ముంబయిలో జరిగిన ఈ విద్యుత్‌ అంతరాయానికి సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికా సంస్థ అంటోంది. ఆ ఉద్రిక్తతల సమయంలో భారత పవర్‌గ్రిడ్‌పై  సైబర్‌ నేరగాళ్లు గురిపెట్టారని,  భారత్‌ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని ఓ సంకేతమివ్వడమే చైనా ఉద్దేశమని సదరు సంస్థ తెలిపింది.


చైనా ప్రభుత్వ అండతోనే..

చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న రెడ్‌ఎకో గ్రూప్‌ అనే సంస్థ భారత్‌లోని  ఐదు ప్రైమరీ లోడ్‌ డిశ్పాచ్‌ సెంటర్లు, విద్యుత్‌ సంస్థల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుందని ఈ నివేదిక వెల్లడించింది. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా సంస్థల్లోని 21 ఐపీ అడ్రస్‌లపై హ్యాకర్లు దాడి చేసినట్లు తెలిపింది. ఈ ఐపీ అడ్రస్‌ల ద్వారా విద్యుత్‌ సరఫరాను నిర్వహించే కంట్రోల్‌ సిస్టమ్స్‌లోకి సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ను చొప్పించినట్లు పేర్కొంది. మహారాష్ట్రలోని పద్గాలో గల లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌లో ఈ మాల్‌వేర్‌ కారణంగానే సాంకేతిక లోపం తలెత్తిందని, ఇది ముంబయిలో భారీ పవర్‌కట్‌కు దారితీసిందని అధ్యయనం పేర్కొంది. వాస్తవానికి గల్వాన్‌ ఘర్షణ జరిగిన తర్వాత కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌.కె. సింగ్‌ మాట్లాడుతూ.. చైనాలో తయారయ్యే విద్యుత్‌ పరికరాల్లో మాల్‌వేర్‌ ఉందేమో అన్న అంశంపై తనిఖీలు ముమ్మరం చేస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.


ఆ అలవాటు మాకు లేదు

రికార్డెడ్‌ ఫ్యూచర్‌ అధ్యయనాన్ని చైనా ఖండించింది. సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని తప్పు పట్టింది. సైబర్‌ భద్రతకు చైనా పెద్ద పీట వేస్తుందని.. ఈ తరహా దాడులకు తాము పూర్తి వ్యతిరేకమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్‌ కూడా అమెరికా సంస్థ నివేదికపై ప్రకటన విడుదల చేసింది. మాల్‌వేర్‌ దాడుల కారణంగా.. పవర్‌ స్టిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ (పీఓఎస్‌ఓసీఓ) కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదంటూ కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే గత ఏడాది ముంబయి  పవర్‌ గ్రిడ్‌ వైఫల్యంపై మాత్రం స్పందించలేదు.


భారత్‌ను బెదిరించడానికేనా

ద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా దూకుడును భారత్‌ దీటుగా ఎదుర్కొంటోంది. బలంగా సమాధానం చెబుతోంది. అది సహించలేకే ఈ సైబర్‌ దాడులకు చైనా ప్రణాళికలు రచించిందని ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ అభిప్రాయపడింది. రికార్డెడ్‌ ఫ్యూచర్‌ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని చెబుతోందని తన కథనంలో తెలిపింది. సరిహద్దుల్లో దూకుడుగా ఉంటే.. ఇలాంటి దాడుల చేస్తామన్న హెచ్చరికను పరోక్షంగా భారత్‌కు పంపించడమే చైనా ఉద్దేశమని ఆ పత్రిక పేర్కొంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన