
ప్రధానాంశాలు
154 మంది బౌద్ధ భిక్షువులకు కొవిడ్
సైనిక పాఠశాలలో 54 మంది విద్యార్థులకు వైరస్
ధర్మశాల, దిల్లీ: ధర్మశాలలోని ఉన్న గ్యూటో మఠంలో 154 మంది బౌద్ధ భిక్షువులు కరోనా బారిన పడినట్లు అధికారులు తెలిపారు. ఈ మఠం హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉంది. గత ఎనిమిది రోజుల్లో కాంగ్రా జిల్లాలో 330 మందికి పైగా బౌద్ధ భిక్షువులకు పరీక్షలు నిర్వహించగా.. 154 మందికి పాజిటివ్‌గా తేలిందని.. వీరంతా గ్యూటో మఠానికి చెందిన వారని కాంగ్రా సీఎంవో గురుదర్శన్ గుప్తా తెలిపారు.
హరియాణా రాష్ట్రం కర్నాల్ జిల్లా కుంజపురాలోని సైనిక్ స్కూల్లో కరోనా కలకలం రేగింది. మంగళవారం ఏకంగా 54 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. సోమవారం ముగ్గురు విద్యార్థులకు కరోనా ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో ఉన్న 390 మంది విద్యార్థుల నమూనాలను సేకరించి, పరీక్షలకు పంపించినట్లు చెప్పారు.
రెండో డోస్ తప్పనిసరి
ఈనాడు, దిల్లీ: కొవిడ్ నియంత్రణకు టీకా రెండో డోసు తీసుకోవడం తప్పనిసరని.. దాన్ని ఎవ్వరూ మరిచిపోవద్దని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ‘‘ఒక డోసు వేయించుకున్నాం ఇంకేం కాదులే అనుకోవద్దు. రెండు డోసులు వేయించుకున్న తర్వాతే కరోనా వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మొదటి డోసు వేయించుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. అది తీసుకోకపోతే వ్యాక్సినేషన్ పూర్తయినట్లు కాదు. అలా చేస్తే ప్రమాదంలో పడినట్లే. అలాంటి వారికి రక్షణ ఉండదు’’ అని ఆయన పేర్కొన్నారు.
రెండో డోస్ నాలుగు నుంచి ఆరు వారాల్లోపు తీసుకోవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు. వ్యాక్సిన్లకు డీజీసీఏ అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చేటప్పుడు నాలుగు నుంచి ఆరు వారాల తేడాతో రెండో డోసు ఇవ్వొచ్చని చెప్పిందని, అందువల్ల 29వ రోజు మలి డోసు తీసుకోలేకపోయిన వారు ఆ తర్వాత రెండు వారాల్లోపు తీసుకోవచ్చని పేర్కొన్నారు. కర్ణాటకలో ఎమ్మెల్యే ఒకరు వైద్య సిబ్బందిని ఇంటికి పిలిపించుకొని వ్యాక్సిన్ వేయించుకున్న అంశంపై నివేదిక కోరినట్లు తెలిపారు.
* ఇప్పటివరకూ కొవిన్ పోర్టల్‌లో 50 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని.. ప్రతి రిజిస్ట్రేషన్‌తో కనీసం ఇద్దరు నమోదు చేసుకున్నారనుకుంటే కోటి మంది పేర్లు నమోదైనట్లు కొవిడ్ వ్యాక్సినేషన్ ఎంపవర్ గ్రూప్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ చెప్పారు.
రెండు వ్యాక్సిన్లు సమర్థవంతమైనవే..
ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లు సమర్థవంతమైనవేనని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ముఖ్యంగా స్వదేశీ వ్యాక్సిన్ సమర్థతపై భిన్న ప్రచారాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వదేశీ వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ తీసుకోవడం ద్వారా ప్రధానిమోదీ యావత్ దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు కొవాగ్జిన్‌పై ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
13 వేల దిగువకు కేసులు
దిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత అయిదారు రోజుల నుంచి 15వేలకు పైగానే నమోదవుతున్న కొత్త కేసులు 13వేల దిగువకు పడిపోవడం ఊరటనిచ్చే అంశం. గత 24 గంటల్లో 12,286 మంది వైరస్ బారిన పడ్డారు. మరణాలు సైతం వందలోపే ఉన్నాయి. తాజాగా 91 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 1,68,358 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 1.48 కోట్లు దాటింది.
టీకా ఎంపిక చేసుకునే సౌలభ్యం ఎవరికీ లేదు
కేంద్ర ఆరోగ్య శాఖ
దిల్లీ: ఏ వ్యాక్సిన్ తీసుకోవాలో ఎంపిక చేసుకునే సౌలభ్యం ఎవరికీ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. టీకా పంపిణీ ప్రక్రియ కొవిన్ ద్వారా జరుగుతుందని పేర్కొంది. సుప్రీంకోర్టులో మంగళవారం నుంచి న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో వారికి వ్యాక్సిన్‌ను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉందనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ ఆ సౌలభ్యం ఎవరికీ లేదని స్పష్టం చేసింది.
మరిన్ని
సినిమా
- ‘వకీల్ సాబ్’కు మహేశ్‌బాబు ప్రశంసలు
- తక్కువ ఖర్చుతో వినూత్న ఇల్లు
- హోం క్వారంటైన్లో పవన్
- పవన్.. మీకు ఈ మాట చెప్పమన్నారు: దిల్‌రాజు
- అదే టిప్పర్.. అదే డ్రైవర్
- ఉప్పెన.. కృతి ఇంత కష్టపడిందా!
- ప్చ్.. ఇది వాళ్ల వ్యక్తిగతం
- మెహ్రీన్ లవ్ ప్రపోజ్.. నజ్రియా దాగుడుమూతలు
- మా కరోనా టీకాలకు అంత సీన్ లేదు!
- దిల్లీ దంచేసింది
ఎక్కువ మంది చదివినవి (Most Read)
