close

ప్రధానాంశాలు

Updated : 03/03/2021 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాతో ఖాండ్వా ఎంపీ మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా పార్లమెంటు సభ్యుడు నందకుమార్‌ చౌహాన్‌ (69) గురుగ్రామ్‌ ఆసుపత్రిలో సోమవారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబసభ్యులు మంగళవారం తెలిపారు. ఆరుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన నందకుమార్‌కు గత నెల కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. ఆరోగ్యం విషమంగా ఉన్న స్థితిలో గురుగ్రామ్‌ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  తదితరులు సంతాపం తెలిపారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన