close

ప్రధానాంశాలు

Published : 04/03/2021 04:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లీటరుకు రూ.8.50 తగ్గించవచ్చు

ఎక్సైజ్‌ సుంకంలో కోతకు వీలుంది  
చమురు ధరలపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ విశ్లేషణ

దిల్లీ: రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్‌ ధరల నుంచి ప్రజలకు ఊరట కలిగించాలని ప్రభుత్వం అనుకుంటే ఆదాయాన్ని నష్టపోకుండానే ఆ పని చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లీటరుకు రూ.8.50 తగ్గించినా కూడా బడ్జెట్‌ ప్రభావితం కాదని వారు గణాంకాలతో చెబుతున్నారు. మోయలేనంతగా పెరిగిపోయిన భారాన్ని తగ్గించాలని వివిధ వర్గాలు కోరుతున్న నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘వాహన ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకం రూపేణా 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.4.35 లక్షల కోట్లు వస్తుందని అంచనా. ఇది బడ్జెట్‌ అంచనా మొత్తం రూ.3.2 లక్షల కోట్లు కంటే ఎక్కువ. అందువల్ల సుంకాన్ని లీటరుకు రూ.8.50 చొప్పున తగ్గించినా బడ్జెట్‌ లక్ష్యాలను చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మార్కెట్‌లో డిమాండ్‌ పుంజుకోవడం, ప్రైవేటీకరణ చర్యలు, ద్రవ్యోల్బణం వంటివాటిని దృష్టిలో పెట్టుకున్నా ధరను ఈ మేరకు తగ్గించవచ్చు’’ అని పేర్కొంది.

ఎక్సైజ్‌ సుంకం తక్కువేం కాదు
గత ఏడాది మార్చి-మే నెలల మధ్య పెట్రోలుపై రూ.13, డీజిల్‌పై రూ.16 చొప్పున (లీటరుకు) ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచారు. ప్రస్తుతం ఈ భారం పెట్రోలుపై రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 చొప్పున ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనమైనా ఆ మేరకు ప్రయోజనం వినియోగదారులకు లభించకుండా సుంకాన్ని పెంచుతూ వచ్చిన విషయం తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన