close

ప్రధానాంశాలు

Published : 05/03/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హెచ్‌1బీ ఉద్యోగాలపై ఆంక్షలు

అమెరికా చట్టసభలో రిపబ్లికన్ల బిల్లు

వాషింగ్టన్‌: తక్కువ వేతనాలతో లభించే విదేశీ ఐటీ నిపుణులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్న కంపెనీలకు ముకుతాడు వేసేలా, స్వదేశీయులకు అధిక ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముగ్గురు రిపబ్లికన్లు అమెరికా చట్టసభ కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. వలసేతర వీసా...హెచ్‌1బీతో వేలమంది ఐటీ నిపుణులను భారత్‌, చైనాల నుంచి అమెరికాకు తీసుకువస్తున్నారని, దీనివల్ల సమాన అర్హతలున్న అమెరికా యువత ఉపాధి అవకాశాలు కోల్పోతోందని రిపబ్లికన్లు ఆరోపించారు. హెచ్‌1బీ వీసాతో విదేశీ ఉద్యోగులను అమెరికాకు తీసుకొచ్చేటట్లయితే వారి వార్షిక వేతనం అదే స్థాయి అమెరికన్‌ ఉద్యోగులకు ఇచ్చే వేతనం కన్నా అధికంగా ఉండాలనే నిబంధన ఆ బిల్లులో పొందుపరిచారు. ఈ మేరకు కంపెనీ యాజమాన్యం...కార్మికశాఖ కార్యదర్శికి దరఖాస్తును అందజేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా హెచ్‌1బీ ఉద్యోగాల వల్ల రెండేళ్ల వరకూ అమెరికన్ల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడదన్న హామీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. విదేశీయులకు గ్రీన్‌కార్డుల మంజూరు కోసం నిర్వహించే లాటరీని కూడా నిలిపివేయాల్సి ఉంటుంది. అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ దిగిపోవడానికి ముందు ఈ ఏడాది జనవరిలో తీసుకొచ్చిన హెచ్‌1బీ వీసా విధానాన్ని అమలు చేయాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. అమెరికా దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో డెమొక్రాట్లకు ఆధిక్యం ఉన్నందున ఈ బిల్లుకు ఆమోదం లభించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన