
ప్రధానాంశాలు
నింగి, నేల, నీరు.. ఏదైనా ఆమె ఓడదు!
పూర్తిగా మహిళా సిబ్బందితో నౌకా యాత్ర
ప్రపంచంలోనే తొలిసారి
దిల్లీ: సంసార సాగరాన్నే కాదు.. కల్లోల సముద్రంలోనూ నౌకను నేర్పుగా నడిపే సామర్థ్యం నారీశక్తికి ఉంది. ఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యం కలిగిన సముద్రయాన రంగంలో మూస పద్ధతులు, ఆలోచన ధోరణులను ఛేదించిన మహిళా లోకానికి జేజేలు పలికేందుకు కేంద్ర నౌకాయాన శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన నౌకా యాత్రను చేపట్టింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ)కు చెందిన ‘ఎం.టి. స్వర్ణకృష్ణ’ అనే భారీ నౌక ఇందుకు వేదికైంది. కేంద్ర రేవులు, నౌకాయాన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జెండా ఊపి ఈ చరిత్రాత్మక యాత్రను ప్రారంభించారు. ప్రపంచ నౌకాయాన చరిత్రలో ఒక నౌకను పూర్తిగా మహిళా అధికారులే నడపడం ఇదే మొదటిసారి.
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వజ్రోత్సవాలతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యాత్రను కేంద్రం చేపట్టింది. ముంబయిలోని జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టులోని లిక్విడ్ బెర్త్ జెట్టీ నుంచి స్వర్ణకృష్ణ బయలుదేరింది. మహిళా నావికా సిబ్బంది త్యాగాలు, సేవలను ఈ సందర్భంగా మంత్రి మాండవీయ కొనియాడారు.
స్వర్ణకృష్ణ.. పెట్రో ఉత్పత్తులను రవాణా చేసే ట్యాంకర్ నౌక. 2010లో దీన్ని నిర్మించారు. గరిష్ఠంగా 10.5 నాట్ (గంటకు దాదాపు 20 కిలోమీటర్లు)ల వేగంతో ప్రయాణిస్తుంది. 73 వేల టన్నుల బరువును ఇది మోసుకెళ్లగలదు.
మరిన్ని
సినిమా
- Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- భారత్లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!
- కార్చిచ్చులా కరోనా
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ
- India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
