అబ్దుల్‌ కలాం సోదరుడి కన్నుమూత

ప్రధానాంశాలు

Published : 08/03/2021 04:41 IST

అబ్దుల్‌ కలాం సోదరుడి కన్నుమూత

ఈనాడు డిజిటల్‌, చెన్నై: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం పెద్దన్నయ్య మహ్మద్‌ ముత్తుమీరా లెబ్బై మరైకాయర్‌ (104) వయోభారంతో తమిళనాడులోని రామేశ్వరంలో ఆదివారం రాత్రి 7.30కు తుదిశ్వాస విడిచారు. ముత్తుమీరా కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన మనవడు ఏపీజే ఎంజే షేక్‌ సలీమ్‌ తెలిపారు. ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని రామేశ్వరంలో ఉంచినట్లు, సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అబ్దుల్‌ కలాం ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ట్రస్టీల్లో ముత్తు మీరా ఒకరు. ఆయన తన 104వ పుట్టిన రోజును గతేడాది నవంబరు 5న కుటుంబీకులతో కలసి జరుపుకొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన