close

ప్రధానాంశాలు

Published : 09/03/2021 05:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహారాష్ట్రను వణికిస్తున్న వైరస్‌

ఒక్కరోజే 11వేల కేసులు

దిల్లీ: దేశంలో గత మూడు రోజులుగా 18వేలకు పైగానే కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 18,599 కేసులు రావడం.. వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా నమోదవుతున్న కేసుల్లో 86.25 శాతం ఆరు రాష్ట్రాల నుంచే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వీటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో తాజాగా 11,141 మందికి వైరస్‌ సోకడం ఆ రాష్ట్రంలో మహమ్మారి విజృంభణకు నిదర్శనం. రాష్ట్ర అసెంబ్లీలో 36 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఔరంగాబాద్‌లో పాక్షికంగా లాక్‌డౌన్‌ అమలు చేసే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
* ఛత్తీస్‌గఢ్‌ ఆరోగ్య మంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌, రెవెన్యూ మంత్రి జైసింగ్‌ అగర్వాల్‌కు కరోనా సోకినట్లు తేలింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన