భారత్‌ ‘కరోనా’ విజయం వెనుక.. భగవద్గీత

ప్రధానాంశాలు

Updated : 12/03/2021 12:23 IST

భారత్‌ ‘కరోనా’ విజయం వెనుక.. భగవద్గీత

ఆ స్ఫూర్తితోనే మానవాళికి సేవ చేశాం: మోదీ

దిల్లీ: కరోనా సమయంలో 130 కోట్ల మంది భారత్‌ ప్రజలు.. భగవద్గీతలో చెప్పిందే చేశారని.. ప్రపంచానికి ఔషధాలు, టీకాలందించి.. తమ వంతు సేవ చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్‌ కరోనా విజయం వెనుక కూడా భగవద్గీతే కారణమని చెప్పారు. గురువారం భగవద్గీతపై స్వామి చిద్భవానంద వ్యాఖ్యానం.. కిండిల్‌ వర్షన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ఆవిష్కరించారు. తమిళనాడులోని శ్రీ రామకృష్ణ తపోవనం చేస్తున్న సేవలను ప్రధాని కొనియాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘సంఘర్షణ సమయంలోనే భగవద్గీత పుట్టింది. ఇప్పుడూ అలాంటి సమయంలోనే ఉన్నాం. కరోనా మహమ్మారి లాంటి సవాల్‌ను మానవాళి ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో గీతా సారం కీలకం. విషాదం నుంచి విజయం వైపునకు ప్రయాణించడాన్ని గీత నేర్పుతుంది. కరోనాను భారత ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారంటే దాని వెనుక భగవద్గీత ఉంది. మహాత్మగాంధీ నుంచి తిలక్‌ వరకు ఎంతో మందికి ఈ పవిత్ర  గ్రంధం స్ఫూర్తినిచ్చింది. ఇటీవల ప్రపంచానికి ఔషధాలు అవసరమైనపుడు భారత్‌ అందుకోసం ఏం చేయాలో అది చేసింది. మన శాస్త్రవేత్తలు చాలా వేగంగా టీకాలు తయారు చేశారు. ఇప్పుడు మేడిన్‌ ఇండియా టీకాలు ప్రపంచమంతా లభ్యమవుతున్నాయి. మానవాళికి ఇది భారత్‌ చేస్తున్న సేవగానే పరిగణించాలి’’ అని మోదీ అన్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన