రైతుల ఆందోళన పూర్తిగా భారత ప్రభుత్వ అంశం

ప్రధానాంశాలు

Updated : 13/03/2021 08:17 IST

రైతుల ఆందోళన పూర్తిగా భారత ప్రభుత్వ అంశం

బ్రిటన్‌ మంత్రి వ్యాఖ్య

లండన్‌: ఒక ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ ఎల్లప్పుడూ నిరసన తెలిపే హక్కుకు హామీ ఇచ్చిందని, సాగు చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ కొన్ని నెలలుగా జరుగుతున్న రైతుల ఆందోళన పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందిన అంశమని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లార్డ్‌ తారిఖ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. సోమవారం నుంచి ఆయన ఐదు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వర్చవల్‌ విధానంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రైతుల ఆందోళనపై బ్రిటన్‌ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో చర్చించడంపై భారత్‌ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని భారత్‌ స్పష్టం చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన