సామాజిక మాధ్యమాల సిబ్బందిని బెదిరించలేదు

ప్రధానాంశాలు

Updated : 15/03/2021 07:59 IST

సామాజిక మాధ్యమాల సిబ్బందిని బెదిరించలేదు

  ఐటీ మంత్రిత్వశాఖ స్పష్టీకరణ

దిల్లీ: సామాజిక మాధ్యమాల సిబ్బంది ఎవరినీ జైలుకు పంపుతామంటూ ప్రభుత్వం  బెదిరించలేదని ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విటర్‌ సిబ్బందిని సర్కారు పైవిధంగా బెదిరించినట్టు వచ్చిన వార్తలను ఖండిస్తూ.. ‘సామాజిక మాధ్యమం ఏదైనా భారత్‌లో నిర్వహిస్తున్న ఇతర వ్యాపారాల మాదిరిగానే ఇక్కడి చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి’ అని ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘పార్లమెంటు వేదికగా చెప్పినట్టు.. సామాజిక మాధ్యమాల వినియోగదారులు ఎవరైనా ప్రభుత్వాన్ని, ప్రధానిని.. లేదా మరో మంత్రిని విమర్శించవచ్చు. సద్విమర్శలను ఆహ్వానిస్తాం. హింసను ప్రేరేపించడం, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టడం తగదు’ అని వెల్లడించింది. ఇటీవల జారీచేసిన మార్గదర్శకాల అమలుకు బలమైన ఫిర్యాదుల పరిష్కార విధానం ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఐటీ మంత్రిత్వశాఖ సూచించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన