హరిద్వార్‌ కుంభమేళా.. నెలరోజులే

ప్రధానాంశాలు

Published : 26/03/2021 05:50 IST

హరిద్వార్‌ కుంభమేళా.. నెలరోజులే

చరిత్రలో తొలిసారి కుదించిన అధికారులు
ఆర్టీ-పీసీఆర్‌లో నెగెటివ్‌ వస్తేనే అనుమతి

దేహ్రాదూన్‌: కొవిడ్‌-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని చరిత్రలో తొలిసారి.. హరిద్వార్‌ కుంభమేళాను నెల రోజులకు పరిమితం చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా..మేళాలో పాల్గొనాలనుకునే భక్తులు/యాత్రికులు తప్పకుండా ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం సమర్పించాలని పేర్కొన్నారు. బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగా నదీతీరంలో ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు కుంభమేళా జరగనుంది. పన్నెండేళ్లకొకసారి జరిగే ఈ మేళాను సాధారణంగా మూడున్నర నెలల పాటు నిర్వహిస్తారు. చివరిసారిగా ఈ మేళాను 2010లో జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 28 వరకు జరిపారు. కరోనా నేపథ్యంలోనే మేళా సమయాన్ని కుదించినట్లు అధికారులు తెలిపారు. మేళాలో పాల్గొనాలనుకొనే భక్తులు తప్పనిసరిగా 72 గంటల్లోపు జారీ చేసిన కొవిడ్‌-19 ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన