ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని భాజపా

ప్రధానాంశాలు

Updated : 26/03/2021 08:51 IST

ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని భాజపా

భూపేష్‌ బఘేల్‌ విమర్శ

ఈనాడు, గువాహటి: అస్సాం శాసనసభ ఎన్నికల్లో ఈసారి ఓటర్లే గెలుస్తారని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, పౌరసత్వ సవరణ చట్టం, ఆర్థిక స్తంభనలపై వారు విజయం సాధిస్తారని చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ అన్నారు. గువాహటిలోని కాంగ్రెస్‌ కార్యాలయం రాజీవ్‌భవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా వెనుకబడిపోయిందని అన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వరద నష్టాలు, తేయాకు కార్మికుల జీవన స్థితిగతులు, ప్రభుత్వంపై పెత్తనం చేస్తున్న స్మగ్లర్ల సిండికేట్‌ ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. వీటికి భాజపా వద్ద సమాధానాలు లేవని చెప్పారు. అత్యంత ముఖ్యమైన పౌరసత్వ సవరణ చట్టంపై భాజపా నాయకులు మౌనం వహిస్తున్నారని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో అస్సాంలో ఈ చట్టాన్ని అమలు చేయమని రాహుల్‌గాంధీ స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరో అయిదేళ్లు అధికారాన్ని భాజపాకు అందించడమంటే ప్రభుత్వాన్ని స్మగ్లర్ల పాలు చేయడమేనన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన