మాస్కులు సరిగ్గా ధరించకపోతే తక్షణం జరిమానా వేయండి

ప్రధానాంశాలు

Updated : 31/03/2021 09:55 IST

మాస్కులు సరిగ్గా ధరించకపోతే తక్షణం జరిమానా వేయండి

విమానాశ్రయాలకు తాజా సూచనలు

దిల్లీ: కొవిడ్‌ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా నిఘా పెంచాలంటూ విమానాశ్రయాలకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మంగళవారం సూచనలు జారీ చేసింది.  ఈనెల 13న సూచనలు జారీచేసినా... వాటిని సరిగ్గా అమలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తాజా సూచనలు జారీచేసింది. మాస్కులు ధరించని ప్రయాణికులను విమానాల నుంచి దించివేయాలని ఆయా సంస్థలను డీజీసీఏ ఇప్పటికే సూచించింది. ఇలాంటి వారు విమానాల్లో ప్రయాణించకుండా 3 నెలల నుంచి రెండేళ్లపాటు నిషేధం విధించే వీలుంది. ఈనెల 15-23 తేదీల మధ్య దేశీయ విమానాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించని మొత్తం 15 మందిని గుర్తించామని, వీరిపై నిషేధం విధించే వీలుందని డీజీసీఏ వర్గాలు తెలిపాయి.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన