ఇక సెలవు రోజుల్లోనూ టీకా : కేంద్ర ఆరోగ్యశాఖ

ప్రధానాంశాలు

Updated : 02/04/2021 10:48 IST

ఇక సెలవు రోజుల్లోనూ టీకా : కేంద్ర ఆరోగ్యశాఖ

45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాల పంపిణీ ప్రారంభం

దిల్లీ: దేశంలో రెండో విడత కొవిడ్‌ విజృంభణ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టేందుకు పలు చర్యలు చేపట్టింది. సెలవు రోజుల్లోనూ వ్యాక్సిన్లను అందజేయాలని; అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ కేంద్రాల్లోనూ వీటిని అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గురువారం లేఖలు రాసింది. ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది. ‘‘దేశవ్యాప్తంగా టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు... ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ టీకా కేంద్రాలను ఉపయోగించుకునేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమగ్రంగా చర్చించాం. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ఉన్నతస్థాయి పర్యవేక్షణ ఉంటుంది. ఈనెల 1 (గురువారం) నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాల పంపిణీ ప్రారంభమైంది’’ అని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దేశంలో ఇప్పటివరకూ 6.5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించారు. వీటిని తీసుకున్నవారిలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు, 45 ఏళ్లు దాటి వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు. ఇక నుంచి 45 ఏళ్లు దాటినవారందరికీ టీకాలు అందిస్తారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన