close

ప్రధానాంశాలు

Updated : 08/04/2021 05:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరిగి సాధారణ స్థాయికి ఆర్థిక కార్యకలాపాలు

భారత్‌పై ఐఎంఎఫ్‌ అంచనాలు

వాషింగ్టన్‌: భారత దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకున్న సూచనలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్‌ మానటరీ ఫండ్‌-ఐఎంఎఫ్‌) అభిప్రాయపడింది. 2021లో 12.5 వృద్ధి రేటు సాధించనుందని తెలిపింది. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకుల వసంత రుతువు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథన్‌ మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కరోనా దెబ్బకు ఇంతవరకు ఒక్క చైనాయే కోలుకోగా, ప్రస్తుత సంవత్సరంలో దానిని అధిగమించి భారత్‌ అభివృద్ధి సాధించనుందని పేర్కొన్నారు. 2022లో 6.9 శాతం వృద్ధిరేటు ఉండనుందని తెలిపారు. ఐఎంఎఫ్‌ పరిశోధన విభాగం అధిపతి మల్హర్‌ నబర్‌ మాట్లాడుతూ ఆర్థిక ప్రగతి బాగున్నప్పటికీ, కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. 2020లో కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు దిగజారిన విషయం విదితమే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన