close

ప్రధానాంశాలు

Published : 08/04/2021 04:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫిల్మ్‌ ట్రైబ్యునల్‌ రద్దు.. అత్యవసర ఆదేశాలు

మరికొన్నింటిలో సంస్కరణలు.. బాలీవుడ్‌ ఖండన

దిల్లీ: ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అపిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎఫ్‌ఏసీటీ) సహా మరికొన్ని ట్రైబ్యునళ్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ట్రైబ్యునళ్ల సంస్కరణల (హేతుబద్ధీకరణ, సర్వీసు నిబంధనలు) ఆర్డినెన్స్‌-2021 పేరుతో దీన్ని అధికారికంగా ప్రకటించింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) నుంచి సినిమాలకు ధ్రువపత్రాలు పొందడంలో సమస్యలు ఉంటే నిర్మాతలు ఇంతవరకు ఈ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేవారు. ఇకపై వారు హైకోర్టులో అపీలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మరికొన్ని ట్రైబ్యునళ్లు కూడా రద్దయ్యాయి. ఇందుకోసం పలు చట్టాల్లో సవరణలు చేసింది. ప్రజలకు పెద్దగా అవసరం ఉండకపోవడంతో కొన్నింటిని రద్దు చేయడంతో పాటు, మరికొన్నింటినీ విలీనం చేయాలని నిర్ణయించింది. మొత్తం 26 ట్రైబ్యునళ్ల స్థానంలో 19 ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లును ఫిబ్రవరిలోనే పెట్టినప్పటికీ ఇంకా దానికి పార్లమెంటు ఆమోదం లభించలేదు. దాంతో అత్యవసర ఆదేశాలు ఇచ్చింది. ఎఫ్‌ఏసీటీని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాలీవుడ్‌ ప్రముఖులు ఖండించారు. దీనివల్ల అనవసర ఆంక్షలతో పాటు, సినిమా విడుదలలో జాప్యం జరుగుతుందని తెలిపారు. ఇది సినీ రంగానికి దుర్దినమని దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ వ్యాఖ్యానించారు. ఇది ఏకపక్ష నిర్ణయమని మరో దర్శకుడు హన్సల్‌ మెహతా అన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన