close

ప్రధానాంశాలు

Published : 08/04/2021 04:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జవాన్లపై ఫేస్‌బుక్‌లో వ్యాఖ్య..

దేశద్రోహం కింద అస్సాం రచయిత్రి అరెస్ట్‌

గువాహటి: మావోయిస్టుల కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌లో చనిపోయిన జవాన్లపై ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యకు గానూ అస్సాం రచయిత్రి శిఖాశర్మపై పోలీసులు దేశద్రోహం కింద అభియోగాలు మోపి అరెస్టు చేశారు. ఇద్దరు భాజపా కార్యకర్తల ఫిర్యాదు ఆధారంగా ఆమెను అరెస్టు చేశారు. నిందితురాలికి 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. ‘‘జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు తమ విధి నిర్వహణలో చనిపోతే వారిని మృతవీరులుగా పేర్కొనడం తగదు. విద్యుత్తు శాఖ ఉద్యోగి విద్యుదాఘాతంతో చనిపోతే అతనూ మృతవీరుడే అవుతారా? ప్రసార మాధ్యమాలు ప్రజల్ని భావోద్వేగానికి గురి చేయకూడదు’’ అని శిఖాశర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన