
ప్రధానాంశాలు
మహారాష్ట్ర, కేంద్రం మధ్య మాటల డోసు
టీకాల కొరత ఉందని.. లేదని
ముంబయి/దిల్లీ: కొవిడ్ టీకా సరఫరా.. నిల్వలపై కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడ నెలకొంది. వ్యాక్సిన్ కొరత ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా.. అసలు కొరతే లేదని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మహారాష్ట్ర అలా చెబుతోందని కేంద్రం తోసిపుచ్చింది. మహారాష్ట్రలో కొవిడ్ వ్యాక్సిన్ కొరత కారణంగా చాలామేర టీకా కేంద్రాలను మూసివేసే పరిస్థితి నెలకొన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే బుధవారం తెలిపారు. రాష్ట్రంలో వారానికి 40 లక్షల టీకా డోసులు అవసరం కాగా.. ప్రస్తుతం 14 లక్షల డోసులే నిల్వ ఉందని, ఇది కేవలం 3 రోజులకే అయిపోతుందని చెప్పారు. కరోనా కేసులు అత్యధికంగా ఉన్నందున మహారాష్ట్రకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఒడిశా కూడా తమ వద్ద ఉన్న టీకా నిల్వలు 3 రోజులకే సరిపోతాయని, మరో 15-20 లక్షల డోసులు పంపించాలని కేంద్రానికి మంగళవారం లేఖ రాసింది.
వైఫల్యాలు కప్పిపుచ్చుకోడానికే : కేంద్ర మంత్రి
టీకాలకు కొరత ఉన్నట్లు మహారాష్ట్ర మరికొన్ని రాష్ట్రాలు చెబుతుండటాన్ని కేంద్రం తోసిపుచ్చింది. మహమ్మారిని కట్టడి చేయడంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆ రాష్ట్రాలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ బుధవారం పేర్కొన్నారు. ప్రధానంగా మహారాష్ట్ర బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తోందని, కరోనాతో పోరాటంలో ఉదాసీన వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్ నేతలు కూడా వ్యాక్సినేషన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
* దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
మరిన్ని
సినిమా
- వకీల్‌సాబ్.. పవన్‌ని హత్తుకున్న తారక్!
- భర్త హత్య.. భార్య ఆత్మహత్య
- పాతకక్షలకు ఆరుగురి బలి
- ఓటీటీలో విడుదలైన ‘శశి’
- టీసీఎస్‌లో ఉద్యోగాల వెల్లువ
- రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి
- రూపాయికి ఎందుకీ కష్టం?
- సన్‌రైజర్స్ చేజేతులా..
- కోహ్లీ ఆవేశం: రిఫరీ మందలింపు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
