close

ప్రధానాంశాలు

Published : 08/04/2021 04:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒంటరిగా వెళ్తున్నప్పుడూ మాస్కు ఉండాల్సిందే

దిల్లీ హైకోర్టు తీర్పు

దిల్లీ: వాహనం నడుపుతున్నప్పుడు కూడా మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి అని బుధవారం దిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ సమయంలో వాహనంలో తను ఒక్కరే ఉన్నప్పటికీ మాస్కును ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రయివేటు కారును ఒంటరిగా నడుపుకొంటూ వెళ్తున్న సమయంలో కూడా మాస్కు పెట్టుకోకపోతే జరిమానా విధించాలన్న దిల్లీ ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో దావాలు దాఖలయ్యాయి. వీటిని కొట్టివేయడానికి న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభ ఎం సింగ్‌ తిరస్కరించారు. రోడ్డుపై ప్రయివేటు కారులో ఒంటిరిగా వెళ్తున్నప్పటికీ, దాన్ని కూడా బహిరంగ ప్రదేశంగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మాస్కు ‘సురక్షా కవచం’లాంటిదని, ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ధరించడం వల్ల ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. జరిమానా విధించే అధికారం జిల్లా కలెక్టర్లకు తప్ప ఇతరులకు లేదన్న వాదనను కూడా తిరస్కరించారు. ఈ అధికారాన్ని వేరే ఉద్యోగులకు బదలాయించే వెసులుబాటు వారికి ఉందని స్పష్టం చేశారు. మాస్కులు పెట్టుకోవడంపై ప్రజలకు అవగాహన కలిగించేలా తప్ప, ఇలాంటి దావాలు వేయకూడదని న్యాయవాదులకు హితవు చెప్పారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన