
ప్రధానాంశాలు
శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు
చెక్‌బౌన్స్ కేసులో చెన్నై ప్రత్యేక న్యాయస్థానం తీర్పు
ఈనాడు డిజిటల్, చెన్నై: చెక్‌బౌన్స్ కేసులో నటుడు, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్, ఆయన భార్య రాధికకు తలో ఏడాది జైలుశిక్ష విధిస్తూ చెన్నై ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. అనంతరం శరత్‌కుమార్‌కు విధించిన శిక్షను నిలుపుదల చేయగా... రాధికకు నేరుగా హాజరు కాలేదన్న కారణంగా పీటీ వారెంటు జారీ అయింది. దీనిపై శరత్‌కుమార్ మాట్లాడుతూ అప్పీల్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. శరత్‌కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్ ఫ్రేమ్స్ అనే సంస్థ తరఫున రేడియన్స్ అనే ప్రైవేటు సంస్థ నుంచి 2014లో రూ.1.50 కోట్లు రుణంగా పొందారు. అందుకు శరత్‌కుమార్, రాధికలు 2017లో ఏడు చెక్కులను రేడియన్స్ సంస్థకు ఇచ్చారు. ఇవి బౌన్స్ కావడంతో కేసు దాఖలైంది. విచారణ పూర్తయిన నేపథ్యంలో శరత్‌కుమార్, రాధిక, మేజిక్ ఫ్రేమ్స్ సంస్థ భాగస్వామి లిస్టన్ స్టీఫెన్‌కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. విక్రమ్‌ప్రభు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా ‘ఇదు ఎన్నమాయం’ అనే చిత్రాన్ని నిర్మించాలని వీరు భావించారు. ఇందుకోసం రూ.1.50 కోట్లు రుణాన్ని పొందారు. 2015 మార్చిలో నగదు తిరిగి ఇస్తామని, ఆ తర్వాతే చిత్రం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దానికి విరుద్ధంగా వ్యవహరించడంతో బాధిత సంస్థ కోర్టును ఆశ్రయించింది.
మరిన్ని
సినిమా
- కరోనా వ్యాక్సిన్ ఎవరెవరు వేసుకోకూడదు?
- వైరస్ ప్రభావం త్వరలో తారస్థాయికి
- ప్రేమించిన వ్యక్తితో కూతురు వెళ్లిపోయిందని...
- పిల్లల్లో పెరుగుతున్న ముప్పు
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- నేను ఎస్టీ కాదని రుజువు చేయగలరా?
- భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం
- Tiktok స్టార్ భార్గవ్ చిప్పాడ అరెస్ట్
- జార్జ్ ఫ్లాయిడ్ హత్య: పోలీస్ అధికారే దోషి
- ఈసారి దిల్లీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
