close

ప్రధానాంశాలు

Published : 11/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పేద దేశాల్లో టీకాల కొరత

లండన్‌: ప్రపంచంలోనే అత్యంత నిరుపేద దేశాలు కొవిడ్‌-19 టీకాల కొరతను ఎదుర్కొంటున్నాయి. వీటిలో దాదాపు 60 దేశాలు వ్యాక్సినేషన్‌ మొదటి డోసుకే పరిమితం కావొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ దేశాలను ఆదుకునేందుకు ఉద్దేశించిన అంతర్జాతీయ కార్యక్రమం కింద సరఫరా కావాల్సిన వ్యాక్సిన్లు జూన్‌ చివరి వరకూ నిలిచిపోనున్నాయని నిపుణులు పేర్కొన్నారు.
టీకాలను పొందే సామర్థ్యం లేని దేశాలను ‘కోవాక్స్‌’ అనే అంతర్జాతీయ కార్యక్రమం ఆదుకుంటోంది. దీనికింద గత రెండు వారాల్లో 92 పేద దేశాలకు కలిపి 20 లక్షల డోసుల కన్నా తక్కువగానే రవాణా అయ్యాయి. అదే సమయంలో.. ఒక్క బ్రిటన్‌లోనే అంతమేర వ్యాక్సినేషన్‌ జరగడం గమనార్హం. ఈ అసమతౌల్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ధనిక దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరికి టీకా అందగా.. పేద దేశాల్లో ప్రతి 500 మందిలో ఒకరికి మాత్రమే అది అందిందన్నారు. భారత్‌ తన సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి టీకాల ఎగుమతిని నిలిపివేయడమే ఈ కొరతకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇరాన్‌లో పది రోజుల లాక్‌డౌన్‌
టెహ్రాన్‌: కరోనా మహమ్మారి నాలుగో దశ వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఇరాన్‌లో శనివారం నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. మధ్యప్రాచ్య దేశాల్లో వైరస్‌ కారణంగా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడిన దేశం ఇరానే కావడం గమనార్హం.ఉద్యానవనాలు, రెస్టారెంట్‌లు, బేకరీలపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇరాన్‌లో నాలుగో దశ వ్యాప్తికి కారణం టీకాలు తక్కువగా వేయడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన