టీకాలు కొవిడ్‌ ఉద్ధృతిని తగ్గిస్తాయి..

ప్రధానాంశాలు

Published : 14/04/2021 04:11 IST

టీకాలు కొవిడ్‌ ఉద్ధృతిని తగ్గిస్తాయి..

దిల్లీ: కొవిడ్‌-19 టీకాలు.. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రం కాకుండా, మరణాల ముప్పు పెరగకుండా అడ్డుకుంటాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బల్‌రామ్‌ భార్గవ మంగళవారం తెలిపారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కొందరు కొవిడ్‌ బారిన పడుతున్న విషయమై అడిగిన ఓ ప్రశ్నకు ఆతయన సమాధానమిచ్చారు. టీకాలు వ్యాధి ఉద్ధృతిని తగ్గిస్తాయని.. వ్యాక్సినేషన్‌తో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితిని 85 శాతం నివారిస్తాయని వివరించారు. రెండు డోసులు వేసుకున్న తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతాయన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన