అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్‌.. అందరికీ ఉచిత టీకా
close

ప్రధానాంశాలు

Published : 03/05/2021 05:40 IST

అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్‌.. అందరికీ ఉచిత టీకా

సంయుక్త ప్రకటనలో 13 పార్టీల నేతల డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: దేశంలోని అన్ని కొవిడ్‌ ఆసుపత్రులకు తగినంత ఆక్సిజన్‌ అందించాలని, 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకా అందించాలని 13 పార్టీల అధినేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘‘దేశవ్యాప్తంగా కరోనా పగ్గాల్లేకుండా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, వైద్య కేంద్రాలకు నిరంతరాయంగా ఆక్సిజన్‌ అందించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉచిత టీకా కార్యక్రమం మొదలుపెట్టాలి. టీకా కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.35 వేల కోట్లను ఇందుకోసం ఉపయోగించాలి’’ అని డిమాండ్‌ చేశారు. ఈ ప్రకటనపై సోనియాగాంధీ, దేవెగౌడ, శరద్‌పవార్‌, ఉద్దవ్‌ ఠాక్రే, మమతా బెనర్జీ, హేమంత్‌ సోరెన్‌, ఎంకే స్టాలిన్‌, మాయావతి, ఫరూక్‌ అబ్దుల్లా, అఖిలేష్‌ యాదవ్‌, తేజశ్వి యాదవ్‌, డి.రాజా, సీతారాం ఏచూరి సంతకం చేశారు.
యువత కోసం 122 కోట్ల డోసులు
దేశంలో 18-45 ఏళ్ల మధ్య వయసు వారు 59 కోట్ల మంది ఉన్నారని, వారి కోసం 122 కోట్ల టీకాల డోసులు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం సమర్పించింది. ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ సమయంలో వీరందరికీ టీకా ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం రెండు రకాల టీకాలే అందుబాటులో ఉండడంతో ప్రాధాన్య క్రమంలో ఇస్తున్నట్టు తెలిపింది. జులై నుంచి స్పుత్నిక్‌-వి కూడా దేశీయంగానే తయారు కానుందని పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన