close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 04:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుప్పకూలిన మెట్రో రైలు వంతెన

రహదారిపై పడిన బోగీలు
మెక్సికోలో 23 మంది దుర్మరణం

మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర మెట్రో రైలు ప్రమాదం సంభవించింది. మెక్సికో నగరంలోని 12వ మెట్రో లైన్‌లో సోమవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి రైలు వంతెన కుప్పకూలింది. అదే సమయంలో దానిపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు బోగీలు రహదారిపై ఉన్న వాహనాలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కనీసం 23 మంది మరణించారు. 70 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మెక్సికో సిటీ మేయర్‌ క్లాడియా షీన్‌బామ్‌ విచారం వ్యక్తం చేశారు. ‘‘శిథిలాల కింద చిక్కుకున్నవారు సజీవంగా ఉన్నారో? లేదో? తెలియదు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. దురదృష్టవశాత్తు మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు’’ అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆమె.. ప్రమాదానికి కారణాలు అన్వేషిస్తున్నామని, కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన