close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 04:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కంగన ట్విటర్‌ ఖాతా శాశ్వతంగా రద్దు

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ పదే పదే నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ.. ఆమె ఖాతాను ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ శాశ్వతంగా రద్దు చేసింది. ప్రత్యేకించి ‘విద్వేషపూరిత ప్రవర్తన, దుర్భాషలాడే స్వభావం నిబంధన’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్‌ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ భాజపాపై విజయం సాధించడం, తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో కంగన అనేక సందేశాలు పోస్ట్‌ చేశారు. వాటిలో - బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో చెలరేగిన హింసపై మమతను నిందిస్తూ ఆమెపై దుర్భాషలాడారు. ‘‘హింసకు దారితీసేలా వ్యవహారశైలి ఉంటే మేం కఠిన చర్యలు తీసుకుంటామన్నది సుస్పష్టం. ప్రతిఒక్కరి విషయంలోనూ ట్విటర్‌ నిబంధనలను మేం న్యాయబద్ధంగా, నిష్పాక్షికంగా అమలు చేస్తాం’’ అని ట్విటర్‌ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ట్విటర్‌ నిబంధనల్లో దుర్భాషలాడే స్వభావానికి సంబంధించి వివరణ ఇచ్చారు. ఎవరి ఖాతానైనా శాశ్వతంగా రద్దుచేస్తే సంబంధిత ఖాతాదారుకు ఆ విషయం తెలియజేస్తామని, వారు ఏ నిబంధనలను ఉల్లంఘించారో స్పష్టం చేస్తామని ట్విటర్‌ పేర్కొంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన