close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జమ్మూ-కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ జగ్మోహన్‌ కన్నుమూత

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, గతంలో జమ్మూ-కశ్మీర్‌ గవర్నర్‌గా పనిచేసిన జగ్మోహన్‌ మల్హోత్రా (93) సోమవారం దిల్లీలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1970ల్లో దిల్లీ అభివృద్ధి అథారిటీ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన సమయంలో ‘టౌన్‌ ప్లానర్‌’గా పేరు పొందారు. అనంతరం ఆయన దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా  పనిచేశారు. 1982 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆయన ప్రశంసలు పొందారు. 1984లో ఆయన జమ్మూ-కశ్మీర్‌ గవర్నర్‌గా నియమితులై ఐదేళ్లు పనిచేశారు. తిరిగి 1990లోనూ గవర్నర్‌గా నియమితులైనప్పటికీ నాటి వీపీ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంతో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆయన్ను తొలగించారు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు దక్కగా.. 2016లో మోదీ ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం
జగ్మోహన్‌ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులు సంతాపం తెలిపారు. ఆయనను ఆదర్శప్రాయమైన పాలకుడిగాను, అంకితభావం ఉన్న రాజకీయ నేతగా కొనియాడారు. జమ్మూ-కశ్మీర్‌లో పాలన యంత్రాంగం మంగళవారం నుంచి 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన