close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 04:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా రేటు 10% దాటితే కఠిన లాక్‌డౌన్‌ విధించాలి

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సూచన

దిల్లీ: దేశంలో కరోనా పాజిటివిటీ రేటు పదిశాతం దాటిన ప్రాంతాల్లో లేదా 60 శాతం పడకలు నిండిన ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్‌ విధించాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సూచించారు. ప్రజల జీవనాధారాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇలాంటి కఠిన ఆంక్షలు దేశవ్యాప్తంగా విధించడం అనేది ఓ పరిష్కారం కాదని స్పష్టంచేశారు. కొన్ని రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌లు విధిస్తూ అమలు చేస్తున్న వ్యూహాన్ని ఆయన తోసిపుచ్చారు. ఇలాంటి చర్యలు కరోనా గొలుసును తెంచడంలో ప్రభావవంతంగా పనిచేయవన్నారు. ‘‘కొవిడ్‌-19 కేసుల పాజిటివిటీ రేటు 10 శాతం దాటిన, 60 శాతం పడకలు నిండిన చోట గొలుసును తెంచేందుకు ప్రాంతీయ లాక్‌డౌన్‌లు విధించాలి.  కేంద్ర హోం మంత్రిత్వశాఖ  మార్గదర్శకాల్లో సైతం ఈ అంశం ఉంది. అయినా.. సరిగా అమలవడం లేదు’’ అని మంగళవారం పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ గులేరియా వెల్లడించారు. పాజిటివిటీ రేటు నియంత్రణలోకి వచ్చాక..క్రమక్రమంగా ఆంక్షలను ఎత్తివేయాలని సూచించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన