close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 04:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సామాజిక కార్యకర్త ట్రాఫిక్‌ రామస్వామి మృతి

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడుకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్‌ రామస్వామి(87) మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చెన్నై, ప్యారిస్‌ కార్నర్‌లో స్వచ్ఛందంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో పాల్గొనే ఆయన పేరుకు ముందు ట్రాఫిక్‌ వచ్చి చేరింది. ఆయన ఎన్నో సామాజిక సమస్యలపై కోర్టుల వరకు వెళ్లి పరిష్కారాలు సాధించారు. తమిళనాడులో ఇటీవల బ్యానర్లు, హోర్డింగుల ఏర్పాటుపై నిషేధం విధించారు. ఇదీ ఆయన పోరాట ఫలితమే. శుభశ్రీ అనే యువతి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ కూలడంతో ప్రాణాలు కోల్పోయింది. దీనిపై రామస్వామి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి బ్యానర్లు సంస్కృతికి వీడ్కోలు చెప్పేలా చేశారు. ఆయనకు హక్కులపై పోరాడటం 14వ ఏటే అలవడింది.  ఆయన జీవిత చరిత్ర సైతం ‘ట్రాఫిక్‌ రామస్వామి’ పేరుతో వెండితెరపైకి ఎక్కింది. ఆయన నాలుగు సినిమాల్లో కూడా నటించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన