కొవిడ్‌ బాధితులకు సిసలైన ‘డాక్టర్‌’
close

ప్రధానాంశాలు

Updated : 07/05/2021 08:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ బాధితులకు సిసలైన ‘డాక్టర్‌’

ఆ కలెక్టర్‌ ఓ ప్రాణదాత

ఆక్సిజన్‌ కొరత తీర్చిన  దార్శనికుడు

ఈనాడు, దిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్న తరుణంలో మహారాష్ట్రలోని నందుర్బార్‌ జిల్లా కలెక్టర్‌ దార్శనికత ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ డాక్టరే కలెక్టరైతే.. ముందుచూపుతో వ్యవహరిస్తే.. ప్రజలను ఎలా కాపాడవచ్చో నిరూపిస్తున్నారు 33 ఏళ్ల డాక్టర్‌ రాజేంద్ర భారుడ్‌. కొవిడ్‌ మొదటి ఉద్ధృతి తగ్గిన సమయంలో.. ఇక అంతా అయిపోయిందిలే అని కూర్చోకుండా ప్రపంచ అనుభవాలను గుర్తించి అప్రమత్తమై తన జిల్లాలోని ఆసుపత్రులను రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ఆయన సమాయత్తం చేసిన తీరు.. ప్రాణవాయువుకు కొరత లేకుండా చేసిన ఏర్పాట్లు ఎందరికో ఆదర్శనీయం. మిగతా జిల్లాలూ ఆయన పంథానే అనుసరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది.
బ్రెజిల్‌ లాంటి దేశాల్లో తగ్గిపోయిన కేసులు మళ్లీ ఉద్ధృతమైన విషయాన్ని గమనించి ఇక్కడా కేసులు తగ్గడం తాత్కాలికమేనన్న భావనకు కలెక్టర్‌ వచ్చారు. అందుకే నందూర్బార్‌ జిల్లాలోనే రోజుకు 2 వేల ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలను అభివృద్ధి చేశారు. మరో 28 మొబైల్‌ టీంలను ఏర్పాటుచేసి మారుమూల ఆదివాసీ ప్రాంతాలకు వెళ్లి ర్యాట్‌ పరీక్షలు చేయించారు. ఒక్క పడకకే కష్టమైన పరిస్థితుల నుంచి 7 వేల ఐసోలేషన్‌ బెడ్లు, 1300 ట్రీట్‌మెంట్‌ బెడ్లు అందుబాటులోకి తెచ్చారు. రూ. 50 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను కొనుగోలుచేసి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పంపిణీ చేశారు.

ప్రాణవాయువు అందిస్తూ..
గతేడాది కొవిడ్‌ ప్రారంభంలో జిల్లాలో ఎక్కడా ద్రవ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంటు లేదు. సెప్టెంబర్‌లోనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మించాలని నిర్ణయించారు. రెండు పెద్ద ప్రైవేటు ఆసుపత్రులను ఒప్పించి వారే సొంతంగా ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొనేలా చేశారు. తాలూకా కేంద్రం షహదాలో ఆసుపత్రి లేకపోవడంతో అక్కడి ఓ హాస్టల్‌నే ఆసుపత్రిగా మార్చి ఆక్సిజన్‌ ప్లాంట్‌ నెలకొల్పారు. ఇప్పుడు అవన్నీ రోజుకు 50 లక్షల లీటర్లదాకా ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తున్నాయి.
ఆదివాసీలకు ఆపద్బాంధవుడు..
గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో ఎక్కువభాగం అటవీ ప్రాంతంతో నిండిన నందూర్బార్‌ జిల్లా జనాభాలో 70% ఆదివాసీలే. గత ఏడాది ఏప్రిల్‌-మేలో ఇక్కడ తొలి కరోనా కేసు నమోదైంది. రోగులకు చికిత్స అందించడానికి ఒక్క ప్రైవేటు ఆసుపత్రి కూడా సుముఖత చూపలేదు. 200 పడకలతో ఉన్న జిల్లా ఆసుపత్రి ఎప్పుడూ 95% సాధారణ రోగులతో నిండి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర చక్కని ఆలోచన చేశారు. వివిధ కారణాల వల్ల మధ్యలో ఆగిపోయిన ఓ ఆసుపత్రి నిర్మాణాన్ని 3 నెలల్లో పూర్తిచేసి 200 పడకలతో కొవిడ్‌ ఆసుపత్రిని సిద్ధం చేశారు. 200 మంది డాక్టర్లు, నర్సులను ఒప్పంద పద్ధతిలో నియమించుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన