సాధువులు, ఖైదీలు,  యాచకులందరికీ వ్యాక్సిన్‌
close

ప్రధానాంశాలు

Updated : 09/05/2021 07:41 IST

సాధువులు, ఖైదీలు,  యాచకులందరికీ వ్యాక్సిన్‌

ఎలాంటి గుర్తింపుకార్డు లేకున్నా అందించాలి
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ టీకా అందుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏడు గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి చూపాలని నిబంధన విధించిన వైద్యఆరోగ్యశాఖ తాజాగా ఆ నిబంధనను సడలించింది. ఆధార్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌ కార్డు, ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌కార్డు, పెన్షన్‌ డాక్యుమెంటు లాంటి గుర్తింపు కార్డుల్లేనివారు ఎంతోమంది ఉన్నారని, అలాంటివారికి గుర్తింపు కార్డు లేదన్న కారణంతో వ్యాక్సిన్‌ నిరాకరించవద్దంటూ వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది. సంచార జాతులు (సాధువులు, సంత్‌లాంటివారు), ఖైదీలు, మానసిక ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారు, వృద్ధాశ్రమాల్లో తల దాచుకొనే వయోవృద్ధులు, రోడ్ల పక్కనుండే యాచకులు, పునరావాస కేంద్రాల్లోని అనాథలతోపాటు ఈ కోవలోకి వచ్చే ఇంకెవరికైనా 18 ఏళ్లు నిండి ఉంటే ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా వ్యాక్సిన్‌ అందించాలని పేర్కొంది. ఈ వర్గాలు వైరస్‌ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
* జిల్లాస్థాయిలోని టాస్క్‌ఫోర్స్‌లు ఇలాంటి దుర్బలవర్గాలను గుర్తించాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది.
* రాష్ట్రస్థాయిలో ఈ వివరాలన్నీ క్రోడీకరించి అలాంటివారందరికీ వ్యాక్సిన్‌ అందించేలా ఉత్తర్వులు జారీ చేయాలి. జిల్లాలవారీగా గరిష్ఠంగా ఎంతమంది ఉంటారో అంచనా వేసి ప్రత్యేకంగా అవసరమైన డోసులు అందించాలి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీని బహిర్గతం చేసి, ఆ ప్రతి ఒకటి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి.
* ఇలాంటివారిని అనుసంధానపరిచే ఓ సంధానకర్తను గుర్తించాలి. వారికి మొబైల్‌ ఫోనుతోపాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏడు గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి ఉండేలా చూడాలి. వీరు పైన పేర్కొన్న వర్గాలకు సేవలు అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన అధికారులైనా కావచ్చు.
* సంధానకర్తను గుర్తించడం, వ్యాక్సినేషన్‌ ప్రణాళికను రూపొందించడం కోసం జిల్లా టాస్క్‌ఫోర్స్‌ ఒక జిల్లాస్థాయి నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలి. వారే ఇలాంటివారికి వ్యాక్సిన్‌ అందించే కేంద్రాలను గుర్తించడంతోపాటు అందుకు తగ్గ ప్రణాళిక రూపొందించాలి. ఈ విషయాన్ని లబ్ధిదారులకు చేరవేసి సకాలంలో టీకా కేంద్రానికి వచ్చేలా చూడాలి.
* వీరి కోసం గుర్తించిన వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో టీకా అందించే బాధ్యతలను జిల్లా ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌ చూడాలి.
* ఇలాంటివారికి వ్యాక్సిన్‌ అందించడానికి కొవిన్‌ పోర్టల్‌లో ప్రత్యేక సెషన్‌ అందుబాటులోకి తెస్తారు.
* ఈ ఉత్తర్వుల కింద ఇచ్చిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి కేవలం గుర్తింపు కార్డులు లేని దుర్బలవర్గాలకు మాత్రమే వ్యాక్సిన్‌ అందించే వ్యక్తిగత బాధ్యతను జిల్లా నోడల్‌ అధికారి వహించాలి.
* కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే వ్యాక్సిన్లను 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఉపయోగించాలి. 18 నుంచి 45 ఏళ్ల మధ్యవారికి రాష్ట్ర ప్రభుత్వాల కోటాను ఉపయోగించాలి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన