పాక్‌ ప్రతిపక్ష నేత విదేశీ ప్రయాణం అడ్డగింత
close

ప్రధానాంశాలు

Updated : 09/05/2021 06:51 IST

పాక్‌ ప్రతిపక్ష నేత విదేశీ ప్రయాణం అడ్డగింత

లాహోర్‌: పాకిస్థాన్‌ ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడైన షహబాజ్‌ షరీఫ్‌ (69) శనివారం కేన్సర్‌ వైద్యం కోసం లండన్‌కు  బయలుదేరుతుండగా.. విమానాశ్రయంలో ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ అథారిటీ (ఎఫ్‌ఐఏ) అధికారులు అడ్డుకున్నారు. ఆయన పేరు బ్లాక్‌లిస్టులో ఉన్నందున దేశం విడిచి వెళ్లేందుకు వీల్లేదని చెప్పడంతో చేసేదిలేక షహబాజ్‌ షరీఫ్‌ వెనక్కు వెళ్లారు. ఈ సంఘటనపై పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (నవాజ్‌) అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబ్‌ మాట్లాడుతూ.. లాహోర్‌ హైకోర్టు అనుమతి ఉన్న వ్యక్తిని ఇలా అడ్డుకోవడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని, దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలో ఉన్న ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆదేశాలతోనే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. పాక్‌ సమాచార మంత్రి చౌధరీ దీనిపై స్పందిస్తూ.. ముందే బ్లాక్‌లిస్టులో ఉన్న షహబాజ్‌ పేరును కోర్టు ఉత్తర్వుల మేరకు ఆ జాబితా నుంచి తొలగించేలా ఆయన న్యాయవాదులు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన