కమ్ముకున్న యుద్ధ మేఘాలు!
close

ప్రధానాంశాలు

Updated : 12/05/2021 05:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమ్ముకున్న యుద్ధ మేఘాలు!

గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌
28 మంది పాలస్తీనియన్ల మృత్యువాత

గాజా సిటీ, జెరూసలెం: ఇజ్రాయెల్‌లో కొన్ని వారాలుగా నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా యుద్ధ రూపు సంతరించుకుంటున్నాయి! భీకర దాడులతో అటు ఇజ్రాయెల్‌, ఇటు గాజా తాజాగా దద్దరిల్లాయి. గాజా నుంచి 500కు పైగా రాకెట్లను హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ పైకి ప్రయోగించగా.. వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్‌ బలగాలు విరుచుకుపడ్డాయి. దాడుల్లో 28 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఒకరు కేరళ మహిళ కావడం గమనార్హం.
జెరూసలెంలోని అల్‌-అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్‌ బలగాలు, పాలస్తీనియన్ల మధ్య సోమవారం ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తున్న హమాస్‌ ఉగ్రవాదులు.. సోమవారం సాయంత్రమే దాడులను ప్రారంభించారు. 500కు పైగా రాకెట్లను వారు ప్రయోగించారు. ఈ దాడుల్లో అష్కెలాన్‌ నగరంలో ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. మరో పది మంది గాయపడ్డారు. మరోవైపు- ఇజ్రాయెల్‌ బలగాలు పదుల సంఖ్యలో వైమానిక దాడులతో గాజాలపై విరుచుకుపడ్డాయి. ఈ విధ్వంసంలో 28 మంది పాలస్తీనియన్లు దుర్మరణం పాలయ్యారు. 152 మంది గాయపడ్డారు. మృతుల్లో పది మంది చిన్నారులు, ఓ మహిళ ఉన్నట్లు సమాచారం. మృతిచెందిన వారిలో కనీసం 16 మంది హమాస్‌ ముష్కరులు ఉన్నారని ఇజ్రాయెల్‌ బలగాలు వెల్లడించాయి. గాజా నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో తమ కమాండర్లు ముగ్గురు మరణించారని హమాస్‌ ఉగ్రవాద ముఠా వెల్లడించింది. హమాస్‌ ఉగ్రవాదులపై దాడుల తీవ్రతను పెంచాలని తాము నిర్ణయించినట్లు ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు తెలిపారు.


భర్తతో వీడియో కాల్‌ మాట్లాడుతుండగా..
అష్కెలాన్‌ నగరంలో మృత్యువాతపడ్డ ఇద్దరు మహిళల్లో.. కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన 31 ఏళ్ల సౌమ్య ఒకరు. కేరళలో ఉన్న తన భర్తతో మంగళవారం వీడియో కాల్‌ మాట్లాడుతుండగానే ఆమె ఇంటిపై రాకెట్‌ పడింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన