గంగలో మృతదేహాలు.. సమాజానికి సిగ్గుచేటు

ప్రధానాంశాలు

Published : 14/05/2021 05:19 IST

గంగలో మృతదేహాలు.. సమాజానికి సిగ్గుచేటు

 ఎన్‌హెచ్‌ఆర్సీ

దిల్లీ: గంగానదిలో గత రెండు రోజులుగా పలు మృతదేహాలు కొట్టుకు వస్తున్నట్టు ఫిర్యాదులు అందుకొన్న జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు.. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. పై సంఘటనకు సంబంధించి తీసుకున్న చర్యలు ఏమిటో నాలుగు వారాల్లోపు నివేదిక రూపంలో తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ‘స్థానిక అధికారులు విఫలమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. పవిత్ర గంగానదిలో ఇలా మృతదేహాలు వదలడం గంగా ప్రక్షాళన ప్రాజెక్టు నిబంధనల ఉల్లంఘనే. అవి కొవిడ్‌ బాధితుల మృతదేహాలుగా మాకు అందిన ఫిర్యాదుల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే నిజమైతే గంగానదిపై ఆధారపడి బతుకుతున్న అందరి జీవితాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సంఘటన సమాజానికి సిగ్గుచేటు’ అని జాతీయ మానవహక్కుల సంఘం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
సిట్‌ ఏర్పాటుకు సుప్రీంలో పిటిషన్‌
గంగానదిలో మృతదేహాలు కొట్టుకువచ్చిన ఘటనపై సిట్టింగ్‌ లేదా రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు ప్రదీప్‌కుమార్‌ యాదవ్‌, విశాల్‌ ఠాక్రే గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన