Corona మృతుల లెక్క... తప్పుల తడక!
close

ప్రధానాంశాలు

Updated : 15/05/2021 07:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona మృతుల లెక్క... తప్పుల తడక!

భారత్‌లో కొవిడ్‌ మరణాలు 4.3 లక్షలు తక్కువగా నమోదు
వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనం అంచనా

బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాలకు సంబంధించి తాజా అధ్యయనమొకటి విస్తుపోయే విషయాలను బయటపెట్టింది! మృతుల సంఖ్యను లెక్కించడంలో పలు దేశాలు పారదర్శకంగా వ్యవహరించలేదని అభిప్రాయపడింది. భారత్‌లో ఈ నెల 3 నాటికి వాస్తవ కరోనా మరణాలతో పోలిస్తే.. 4.3 లక్షల మరణాలు తక్కువగా నమోదయ్యాయని అంచనా వేసింది. అమెరికా, రష్యా లెక్కల్లోనూ గణనీయమైన తేడాలు ఉన్నాయని సూచించింది. ‘కొవిడ్‌తో మొత్తం మరణాల అంచనా’ పేరుతో ‘యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ)’ ఈ అధ్యయన నివేదికను వెలువరించింది. తాజా అధ్యయనం ప్రకారం.. కొవిడ్‌ మరణాల లెక్కింపులో బ్రిటన్‌ మెరుగ్గా వ్యవహరించింది. ఉన్నంతలో కాస్త కచ్చితమైన గణాంకాలను బయటపెట్టింది. రష్యాలో అధికారిక గణాంకాలకు, వాస్తవ లెక్కలకు మధ్య చాలా వ్యత్యాసముంది. అమెరికాలో మరణాలు వాస్తవ లెక్కల కంటే 3.3 లక్షలు తక్కువగా నమోదయ్యాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు తగిన సంఖ్యలో జరగకపోవడం మృతుల లెక్కల్లో తేడాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. కరోనా విజృంభణ సమయంలో వారం వారం నమోదైన మరణాలు, అంతకుముందు సీజన్లలో చోటుచేసుకున్న మరణాల సగటును పోల్చిచూడటం ద్వారా ఐహెచ్‌ఎంఈ తాజా అధ్యయనాన్ని నిర్వహించింది.

పరిస్థితులు ఆందోళనకరం: టెడ్రోస్‌
ఐరాస: భారత్‌లో కొవిడ్‌ పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు. కష్ట సమయంలో అనేక దేశాలు భారత్‌కు తోడుగా నిలుస్తున్నాయని తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన