కరోనాతో డా।। కేకే అగర్వాల్‌ మృతి
close

ప్రధానాంశాలు

Published : 19/05/2021 05:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో డా।। కేకే అగర్వాల్‌ మృతి

దిల్లీ: పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారతీయ వైద్యసంఘం మాజీ అధ్యక్షుడు, ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ కేకే అగర్వాల్‌ (62) కరోనాతో మృతిచెందారు. ఇటీవలి కాలంలో కొవిడ్‌- 19పై ప్రజలను అప్రమత్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు పోస్ట్‌ చేసి కూడా ఆయన ప్రాచుర్యం పొందారు. ఎయిమ్స్‌లో గత వారం రోజులుగా వెంటిలేటరు సాయంతో చికిత్స పొందుతున్న అగర్వాల్‌ మహమ్మారితో సుదీర్ఘ పోరాటం అనంతరం సోమవారం రాత్రి 11.30కు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య డాక్టర్‌ వీణా అగర్వాల్‌, కుమారుడు నీలేష్‌, కుమార్తె నైనా ఉన్నారు. యాంటీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు జనం తటపటాయిస్తున్న దశలో గత జనవరిలోనే మొదటి డోసు తీసుకొన్న అగర్వాల్‌ ప్రజాచైతన్యం కోసం ఆ దృశ్యాన్ని తన కారు నుంచే ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ సందర్భంగా ఇంటి నుంచి ఆయనకు ఫోను రావడం, భార్యాభర్తల సంభాషణ జనంలోకి వెళ్లడం తెలిసిందే. 1958లో దిల్లీలో పుట్టిన అగర్వాల్‌ 2010లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. డాక్టర్‌ బీసీ రాయ్‌ అవార్డు సైతం పొందిన ఆయన సీపీఆర్‌ (చేతులతో జీవితాన్ని కాపాడే కిటుకు) విధానంపై ప్రజలకు విస్తృతంగా ఇచ్చిన శిక్షణకు గాను లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో కూడా నమోదయ్యారు. ఓ దిగ్గజాన్ని కోల్పోయామంటూ ఐఎంఏ ట్విటరు ద్వారా నివాళి అర్పించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన