ముందుచూపు లేకే ముప్పు

ప్రధానాంశాలు

Published : 21/05/2021 05:27 IST

ముందుచూపు లేకే ముప్పు

ప్రధానికి 116 మంది మాజీ అధికారుల లేఖ

దిల్లీ: దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి 116 మంది మాజీ ఉన్నతాధికారులు గురువారం బహిరంగ లేఖ రాశారు. కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నామంటూ చెప్పుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోందే తప్ప ప్రభుత్వం కీలక సమస్యలను పట్టించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. దీనిపై సంతకాలు చేసిన వారిలో కేబినెట్‌ మాజీ కార్యదర్శి కె.ఎం.చంద్రశేఖర్‌, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కె.సుజాతారావు, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్‌ మేనన్‌, ప్రధాని మాజీ సలహాదారు టీకేఏ నాయర్‌, మాజీ ప్రధాన సమాచార కమిషనర్‌ వజహత్‌ హబీబుల్లా, మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌లు ఉన్నారు. ‘‘మొత్తం ప్రపంచాన్నే భయపెడుతున్న మహమ్మారి భారత ప్రజలను విడిచిపెట్టదని మాకు తెలుసు. ఇంత పెద్ద సంక్షోభంపై ప్రభుత్వం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు...ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. వైరస్‌ తీవ్రతపై అంతర్జాతీయ నిపుణులు, దేశంలోని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. తగినన్ని టీకాలను నిల్వ చేసుకోవడానికి ఎలాంటి ముందస్తు ప్రణాళికలను రూపొందించకపోవడం క్షమార్హం కాదు. ప్రపంచానికే పెద్ద టీకాల సరఫరాదారుగా భారత్‌ ఉన్నప్పటికీ, వ్యూహం లేకుండా పోయింది.
ఏదీ ఆత్మనిర్భర్‌?
ఆత్మనిర్భర్‌ భారత్‌ గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రపంచ సాయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. పీఎం కేర్స్‌ నిధికి విరాళాలు ఎలా వచ్చాయి? వాటిని దేనికోసం ఉపయోగించారన్నదానిపై పారదర్శకత పాటించడం లేదు. సెంట్రల్‌ విస్టా వంటి పనులకు ఖర్చు చేయడాన్ని ఆపాలి. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.7,000 అందేటట్టు నగదు బదిలీ చేయాలి’’ అని సూచించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన